Friday, 1 May 2026

వెల్లుల్లి పొట్టు సులువుగా రావాలంటే

 కూరలలోకి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి, ఆవకాయ వంటి పచ్చళ్ళు పట్టేందుకు వెల్లుల్లి అవసరం. కానీ వాటిని ఒలవడం మాత్రం చాలా కష్టం.  కింది టిప్స్ తో సులభంగా ఒలవచ్చు.

మూత ఉన్న డబ్బాలో ఒక నాణెము ,వెల్లుల్లి రెబ్బలను వేసి వేగంగ ఊపండి. ఇలా చేయడం వలన ఆ రాపిడికి పొట్టు దానంతట అదే విడిపోతుంది.

వెల్లుల్లి రెబ్బలకు నూనె రాసి, వాటికి గుప్పెడు ఉప్పు కలిపి ఒక మూడు గంటలు ఎండనివ్వండి .ఆపై మెత్తటి కాటన్ వస్త్రంలో ముడివేసి.. నేలకేసి కొడితే సరి .పొట్టు రాలిపోతుంది.

వెల్లుల్లిపాయలను మైక్రోవేవ్లో 15 నుండి 20 సెకండ్ల పాటు వేడి చేయండి. లోపల ఉండే తేమ పోయి పొట్టు వదులు అయిపోతుంది సులువుగా వచ్చేస్తుంది.

No comments:

Post a Comment